క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువుల్లో నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అప్పా చెరువులో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు హైడ్రా అధికారుల. రాజేంద్రనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి, మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి చెందిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడం సంచలనంగా మారింది.
గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం నేలమట్టం చేసింది. శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా పదమూడు షెడ్లను నిర్మించినట్లుగా నివేదిక ఇచ్చారు అధికారులు.
Read More : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్.. పరుగులు పెట్టిన హరీష్ రావు
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం స్థానిక పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్ల నిర్మాణాలను అధికారులు తొలగించారు.ఈ తొలగింపులతో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల చెరువును భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకొనున్నారు. 2015లో అప్పా చెరువులోని 3 ఎకరాలను ఆక్రమించి శ్రీనివాస్ రెడ్డి షెడ్లు నిర్మించారని స్ఖానికులు చెబుతున్నారు. ఇక గగన్ పహాడ్ పరిధిలోనే ఉన్న మామిడి చెరువులో నిర్మించిన షెడ్లను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించిన బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి.. తాను ఎలాంటి ఆక్రమణలు చేయలేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారని మండిపడ్డారు. హైడ్రా అధికారులు కొందరిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.