తెలంగాణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్.. పరుగులు పెట్టిన హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్ర అనార్యోగానికి గురయ్యారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గులాబీ పెద్దలు కలవరపడ్డారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఎమ్మెల్యేను హైదరాబాద్ తీసుకొచ్చే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావ.

ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కోవా లక్ష్మి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలియడంతో మాజీ మంత్రి హరీష్ రావు.. హుటాహుటిన ఆసిఫాబాద్ వచ్చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఆమె నివాసంలో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు హరీష్ రావు. వైద్యులతో మాట్లాడారు. వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు కోవాలక్ష్మిని తరలించారు. హరీష్ రావే వైద్యులతో మాట్లాడి ఎమ్మెల్యే లక్ష్మిని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేశారు.

Back to top button