క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఇప్పుడంతా ఆన్ లైన్ మయం. చేతిలోనే ప్రపంచం. మనీ లావాదేవీలన్ని ఫోన్ లోనే. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ తో చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియాలో యూపీఐతో పేమెంట్స్ ఓ విప్లవం. ప్రభుత్వరంగ సంస్థల నుండి స్ట్రీట్ వెండర్స్ వరకు అంతా యూపీఐతో చెల్లింపులు చేస్తున్న వారే. తీసుకుంటున్న వారే. కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలు మాత్రం అనాలోచిత నిర్ణయం తీసుకున్నాయి. యూపీఐతో చెల్లింపులు నిలిపివేశాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆటోమెటిక్ గా బిల్ చెల్లింపులకు అవకాశం ఉండటం, ఈజీగా ఆండ్రాయిడ్ మొబైల్ తో చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండటంతో అందరూ చాలా మంది యాప్స్ పై ఆధారపడ్డారు. అకస్మాత్తుగా చెల్లింపులు నిలిపివేయటం, విద్యుత్ సంస్థల పేమెంట్ లింక్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్ లో విద్యుత్ సంస్థల ఆఫీసుల వద్ద నిలబడాల్సి వచ్చింది. అదే సమయంలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోయాయి.
Read More : విలీనంపై మాట్లాడని కేసీఆర్,హరీష్.. రేవంత్ చెప్పిందే నిజమా!
బిల్లుల వసూల్ తగ్గడం.. జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో విద్యుత్ అధికారులు దిగొచ్చారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తో ఒప్పందం చేసుకున్నారు. గతంలో రిజర్వ్ బ్యాంకు ఈ సేవలు నిలిపివేయగా ఇప్పుడు పునరుద్ధరించారు. పోన్ ఫే ఇప్పటికే చెల్లింపులను స్వీకరిస్తోంది. త్వరలోనే గూగుల్ పే తో పాటు ఇతర యాప్స్ నుండి కూడా పేమెంట్స్ స్వీకరిస్తామని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి.