జాతీయం

ప్రపంచంలోనే ఇండియా ఫుడ్ ది బెస్ట్

ప్రపంచంలోనే ఇండియా ఫుడ్ ది బెస్ట్ అని స్విట్జర్లాండ్ కి చెందిన WWF లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం మన భారతదేశంలో వివిధ రకాల మొక్కల నుండి అలాగే జంతువుల నుండి ఆహారం అనేది ఎక్కువగా తయారు చేస్తున్నారు. అయితే వేరే దేశాల్లో ఎక్కువగా ఇలా మొక్కలనుండి అయితే మాత్రం ఆహారాన్ని తయారు చేసుకోలేరు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ఆహారమే బాగలేనప్పుడు ఖచ్చితంగా ఆనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. అయితే ఈ స్విట్జర్లాండ్ నిర్వహించిన సర్వేలో మన భారతదేశానికి మొదటి స్థానం రావడం అనేది మనం గర్వించగల విషయం.

తాజాగా 2024 స్విట్జర్లాండ్ ది బెస్ట్ ఫుడ్ ఏ దేశంలో వినియోగిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. ఇందులో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆహారం అనేది ఎక్కువగా మొక్కల నుండి లభించడం వల్ల ఇది మంచి ఫుడ్ అని అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మంచి ఫుడ్ అని ఆ సర్వే వాళ్ళు చెప్పారు. అలాగే ఈ సర్వేలోని అతి చెత్త ఫుడ్ వాడుతున్నటువంటి దేశాలు ఆస్ట్రేలియా అలాగే అర్జెంటీనా మరియు యుఎస్. ఈ దేశాలన్నీ కూడా చెత్త ఫుడ్ వినియోగిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ప్రపంచంలోనే ది బెస్ట్ ఫుడ్ మన భారతదేశానికి తగ్గడంతో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు.

Back to top button