
Himachal Pradesh Crime: విద్యార్థులకు మంచి చెడులు నేర్పించాల్సిన టీచరే దారి తప్పాడు. తండ్రిలా తమ విద్యార్థులను చూడాల్సిన గురువే తప్పుడు పనులు చేశాడు. పదుల సంఖ్యలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కీచక టీచర్ ను కటకటాల్లోకి నూకారు. ఈ దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.
లెక్క తప్పిన లెక్కల మాస్టారు!
తాజాగా సిరౌర్మ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అధికారులు ‘శిక్ష సంవాద్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లోని పలువురు విద్యార్థినిలు చేసిన ఫిర్యాదులు చూసి ప్రిన్సిపల్ షాకయ్యారు. అందరి ఫిర్యాదు ఒక్కటే ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడు. గణితం బోధిస్తున్న టీచర్ చాలా రోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వెల్లడించారు. తమను తాకకూడని ప్రదేశంలో తాడుతూ లైంగికంగా హింసిస్తున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చారు.
ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదును ప్రిన్సిపల్.. విద్యాశాఖ అధికారులకు ఫార్వర్డ్ చేశాడు. అదే సమయంలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపించాడు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు సదరు టీచర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అటు విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. అప్పటికే స్కూల్ దగ్గరికి చేరుకున్న పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో విద్యార్థుల ఆరోపణలు నిజం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు సదరు ఉపాధ్యాయుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో నిజా నిజాలు వెల్లడి అవుతాయని తెలిపారు.
Read Also: ప్రియుడితో కలిసి తల్లినే చంపిన బాలిక – గొంతు బిగించి.. సుత్తితో కొట్టి.. అబ్బా ఎంత దారుణం..!