జాతీయంసినిమా

VIRAL: రాజమౌళి తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్

VIRAL: దర్శకధీరుడు రాజమౌళి వారణాసి ఈవెంట్‌లో హనుమాన్‌ పాత్రపై మాట్లాడిన సందర్భంలో “తాను దేవుడిని నమ్మేవాడిని కాదు” అని చెప్పడం పెద్ద చర్చగా మారింది.

VIRAL: దర్శకధీరుడు రాజమౌళి వారణాసి ఈవెంట్‌లో హనుమాన్‌ పాత్రపై మాట్లాడిన సందర్భంలో “తాను దేవుడిని నమ్మేవాడిని కాదు” అని చెప్పడం పెద్ద చర్చగా మారింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు, కొంతమంది నెటిజన్లు కఠినంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా రియాక్ట్ అవడం ఇప్పుడు కొత్త మలుపు తీసుకొచ్చింది. రాజమౌళిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఆరోపణలను ఆర్జీవీ ట్విట్టర్‌లోనే ఎదుర్కొంటూ, రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి నమ్మే హక్కు ఎంత ఉంటుందో, నమ్మకపోవడానికి కూడా అంతే హక్కున్నదని ట్వీట్ చేశాడు.

ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు తీర్చిదిద్దడానికి గ్యాంగ్‌స్టర్‌ కావాలా? భయానక కథలు నిర్మించడానికి దెయ్యం అయి ఉండాలా? అలానే దేవుడిని నమ్మకపోయినా, ఆయనపై ఆధారంగా కథలను నిర్మించడం పూర్తిగా సాధ్యమేనని ఆర్జీవీ అన్నాడు. అసలు ఇక్కడ సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని, నమ్మకాలు లేకపోయినా ఇంత భారీ విజయాన్ని సాధించడం కొంతమందికి జీర్ణం కావడం లేదని వ్యాఖ్యానించాడు. దేవుడికి, రాజమౌళికి ఎలాంటి సమస్యలూ లేవని, అర్థం చేసుకోలేని వారే ఈ వివాదాన్ని పెంచుతూ ఉన్నారని చెబుతూ వర్మ తన స్టైల్లోనే ఈ వివాదానికి ముగింపు పలికేలా స్పందించాడు.

ALSO READ: Dermatology Tips: చలికాలంలో రోజూ స్నానం చేయడం మంచిది కాదట.. ఎందుకంటే?

Back to top button