క్రైమ్

పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు

జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ అనుమాండ్ల ఝాన్సీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కాలు విరగడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె గాయపడ్డారు. ఈ ఘటనలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సేఫ్ గా బయటపడ్డారు.

తొర్రూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఆమె అత్త కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డితో పాటు హీరోయిన్ ప్రియాంక మోహన్ వచ్చారు. షాప్ ముందు ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో హీరోయిన్ ప్రియాంక మోహన్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. ఝాన్సీరెడ్డి మాత్రం గాయపడ్డారు. కిందపడిపోవడంతో అమె కాలుకు ఫ్యాక్చర్ అయింది. స్థానికంగా ప్రాథమిక చికిత్సలు చేసిన అనంతరం ఝాన్సీరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

Read More : ఇద్దరు గన్ మెన్లు తొలగింపు.. కొండా సురేఖకు రేవంత్ షాక్

అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఝాన్సీ రెడ్డి భావించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడించేందుకు కాంగ్రెస్‌ ఝాన్సీ రెడ్డిని రంగంలోకి దించేందుకు పక్కాప్లాన్ చేసింది. అయితే చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై వివాదం చెలరేగింది. ఆమె ఎన్ఆర్ఐ పౌరసత్వం కారణంగా సమస్యలు వస్తాయని భావించి కోడలు యశస్వినీ రెడ్డిని బరిలోకి దింపారు. ఎర్రబెల్లిపై ఆమె విజయం సాధించారు.

Back to top button