తెలంగాణహైదరాబాద్

పాకిస్తాన్ కంపెనీలతో రేవంత్ వేల కోట్ల డీల్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయల స్కాంకు తెర తీశారని అన్నారు. అందుకే మూసీ ప్రాజెక్ట్ అంచనాను 50 వేల నుంచి మూడు నెలల్లోనే లక్షా 50 వేల కోట్లకు పెంచారన్నారు కేటీఆర్. మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన ఎస్టీపీలను వాడుకుంటే సరిపోతుందన్నారు. మూసీ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారంటూ కేటీఆర్ బాంబ్ పేల్చారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి ఫతేనగర్ లో నిర్మించిన సీవరేజ్ వాటర్ ప్లాంట్ ను కేటీఆర్ పరిశీలించారు. తమ హయాంలో 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 31 ఎస్టీపీలు నిర్మించామన్నారు కేటీఆర్. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉందన్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరన్నారు కేటీఆర్.

Back to top button