సంధ్య థియేటర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండదన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
అల్లు అర్జున్‌పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు అల్లు అర్జున్ మనిషేనా అన్నారు. డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు థియేటర్‌లోనే కూర్చున్నాడని.. అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాడు..
అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 10 థియేటర్లు ఉన్నాయి.. అల్లు అర్జున్ వస్తున్నాడని 10 థియేటర్ల మంది సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చారు.. అల్లు అర్జున్ అనుమతి లేకుండా సంధ్య థియేటర్ కి వచ్చాడని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ విషయంలో ఇంత జరిగితే హై కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చిందని..
రాత్రి 12 లోపు జైలు నుండి వదిలి పెట్టాలని చెప్పింది.. రాత్రికి రాత్రే నేనెందుకు వదిలిపెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకరిని హత్య చేసిందని.. ఒకరి ప్రాణం పోయిన తరువాత కూడా స్పెషల్ రాయితీలు కావాలంటే నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇవ్వనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా? దేనికి మీ పరామర్శలని
సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.