తెలంగాణ

నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిక!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ రోజు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం నుంచే దీనికి సంబంధించిన టాక్ నడుస్తోంది. అయితే కేకే మౌనంతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది. తిరిగి ఇవాళ ఏకంగా కేకే పార్టీలో జాయిన్ అవుతున్న న్యూసే వచ్చింది. కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. అధికారం దక్కించుకునే స్థితికి వెళ్లిపోయింది.

Read Also : నగరంలో కిడ్నాప్‌ గ్యాంగ్‌ల కలకలం.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్!!

ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు అయితే గతంలో కేసీఆర్ తెరదీసి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పరిస్థితిని రేవంత్ సైతం సృష్టించి తిరిగి బీఆర్ఎస్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుందామని హైకమాండ్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతూనే ఉన్నారు. దాదాపు అంతా బిచానా సర్దేస్తారని.. చివరకు కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని అంటున్నారు. కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనుండటంతో బీఆర్ఎస్‌కు గుబులు పట్టుకుంది.

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలోని ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రి కీలక ఆదేశాలు!!
  2. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ కసరత్తు.. ఎవరికి అవకాశం దక్కనుంది..??
  3. ఏదో ఒక రోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతా.. సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
  4. నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!!
  5. పర్యాటకులకు కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగరా బోగత జలపాతం..

Back to top button