తెలంగాణ
Trending

నిరుద్యోగులను రెచ్చిగొడితే తాట తీస్తా.. సీఎ రేవంత్ మాస్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం విద్యార్థులను రెచ్చగొడుతువ్నారని అన్నారు. గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్లు లబ్ది పొందారన్నారు. చిల్లర రాజకీయాల కోసం నిరుద్యోగులను రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రోడ్డున పడేసిన నేతలకు.. వాళ్ల ఉద్యోగాలు పోతే తప్ప విద్యార్థులు, నోరుద్యోగులు గుర్తు రాలేదని విమర్శించారు. నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదన్న రేవంత్.. కొంతమంది కుట్రలకు మీరు పావులుగా మారకండని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలపై సొంతంగా ఆలోచన చేయాలన్నారు.

నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పేరిట 1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు.

Back to top button