తెలంగాణ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు, 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌ పోస్టులు, 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి. ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Also Read : లోక్‌సభలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్!!

ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. 3035 పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. పర్యాటకులకు కనువిందు చేస్తున్న తెలంగాణ నయాగరా బోగత జలపాతం..
  2. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ.. నేడు సమావేశాలు, రేపు ఢిల్లీకి!!
  3. అవినీతి ఆరోపణలు, తోటి సిబ్బందితో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం!!
  4. లక్కీ యెస్ట్ ఫెల్లో.. ఇద్దరు భార్యల చేతుల మీదుగా ముచ్చటగా మూడో పెళ్లి!!
  5. ఇదేమి పోలీసింగ్… సార్లు?!… తెలంగాణ పోలీసుల వ్యవస్థకే తలవంపులు తెచ్చేలా చింతపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డు బిహేవియర్

Back to top button