రష్యాలోని ఓ మాల్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. షాపింగ్ చేసిన మహిళ బిల్ కౌంటర్ దగ్గర కొత్త వాదన తీసుకొచ్చింది. తాను కొనుగోలు చేసిన నారింజ పళ్లను ఒలిచి తూకం కోసం ఇచ్చింది. ఇదేంటని కౌంటర్ దగ్గర ఉన్న మాల్ ఉద్యోగి అడగగా.. మీరు పండు కోసం డబ్బులు వసూలు చేస్తారు, తొక్క బరువు కోసం మేము ఎందుకు చెల్లించాలి అని ఆమె చెప్పింది.దీంతో ఆ ఉద్యోగి షాకైంది. తర్వాత వినియోగదారురాలికి ఆమె దిమ్మ తిరగే షాకిచ్చింది.
సదరు మహిళ కోడిగుడ్లు కొనుగోలు చేయగా.. కోడిగుడ్లను పగలగొట్టి ఓ ప్లాస్టిక్ కవర్ లో వేసింది. మీరు లోపల ఉన్న పదార్థాన్ని డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పగొటకొట్టి పొత్తు తీసేశానని చెప్పింది. కూల్ డ్రిక్స్ బాటిల్ ఓపెన్ చేసి లిక్విడ్ ను కవర్ లో పోసింది. బాటిల్ ను తానే ఉంచేసుకుంది ఉద్యోగిని. దెబ్బకు షాపింగ్ చేసిన మహిళ దారికొచ్చింది. తాను చేసిన తప్పేంటో తెలుసుకుని రియలైజైంది. ఎప్పటిలానే బిల్లు చేయాలని కోరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మాల్ ఉద్యోగిని చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.