తెలంగాణ

నాతో మాట్లాడుతూనే వరదలో కొట్టుకుపోయారు.. బోరున ఏడ్చిన మంత్రి పొంగులేటి

తెలంగాణలో వరదలు బీభత్సం స్పష్టించాయి. కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మహబూబా బాద్ జిల్లాలో పూర్తిగా నీట మునిగింది. మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం నగరం జలమలమైంది. పాలేరు నియోజకవర్గంలోని వందలాది గ్రామాలు నీట మునిగాయి. వరద కొందరిని పొట్టన పెట్టుకుంది. తన నియోజకవర్గంలోని వరద పరిస్థితిని చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలో బోరున ఏడ్చారు.

ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ లో ఓ బ్రిక్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి చెందిన నిరుపేద కుటుంబం మున్నేరు వాగు వరదల్లో చిక్కుకుంది. వరదను ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టడంతో పైకి ఎక్కారు. ఇంటిపై నుంచే రక్షించాలంటూ కేకలు వేశారు. వరదలో చిక్కుకున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్లతో ఫోన్ లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, కాపాడుతామని చెప్పారు. అయితే వాళ్లను రెస్క్యూ చేయడం సాధ్యం కాలేదు. ndrf టీమ్స్ వచ్చినా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మధ్యలోనే వెనక్కి వచ్చేశారు.హెలికాప్టర్ కోసం ప్రయత్నించినా వాతావరణ సహకరించకపోవడంతో సాధ్యం కాలేదు. అయితే డ్రోన్ ద్వారా బాధితులకు సేఫ్టీ జాకెట్లు పంపించారు.

అయితే ఇంతలోనే వరద ఉధృతి పెరిగి ఇంటి గోడ కూలిపోయింది. ఇంటిపై ఉన్న ముగ్గురు మున్నేరు వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటనను వివరిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రక్షించాలని తనను వేడుకున్నా కాపాడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేసిన ఫలితం లేకపోయిందన్నారు. అయితే లైఫ్ జాకెట్లు వేసుకున్నారు కాబట్టి వారు క్షేమంగా బయటికి రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని కన్నీరు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

 

Back to top button