హీరో నాగార్జున ఎన్ కన్వెషన్‌లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కూల్చివేతలపై నాగార్జున హైకోర్టుకు వెళ్లగా .. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకే ఎన్ కన్వేన్షన్ లోని అక్రమ కట్టడాలన్ని నేలమట్టమయ్యాయి. N కన్వేషన్ కూల్చివేతల విషయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశారని తెలుస్తోంది. కోర్టుకు వెళతారని ముందే ఊహించి.. తెల్లవారుజామునే ఆపరేషన్ మొదలు పెట్టారని చెబుతున్నారు.
హీో నాగార్జున నిద్ర లేచే సరికే ఎన్ కన్వెన్షన్ ముందు బుల్డోజర్లు, జేసీబీలు, పెద్ద పెద్ద యంత్రాలు దర్శనమిచ్చాయి. వందలాది మంది పోలీసులను మోహరించారు. వచ్చిన వెంటనే పని ప్రారంభించారు హైడ్రా సిబ్బంది. మూడు గంటల్లోనే అక్రమ కట్టడాలన్ని నేలమట్టం అయ్యాయి. హైకోర్టు ప్రారంభమయ్యే సమయానికే కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయి. కూల్చివేతలు ఆపాలని హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్లినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హైకోర్టు స్టే ఇచ్చే వరకే నిర్మాణాలన్ని నేలమట్టం అయ్యాయి.
చెరువు భూముల్లోని ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా కమిషనర్ కు ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామన్నారు. ఎన్ కన్వేన్షన్ పై హైకోర్టు స్టే ఇచ్చిందనడం అవాస్తవమన్నారు ఏపీ రంగనాథ్. కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. చెరువు FTLలో నిర్మించిన అక్రమ కట్టడాలనే కూల్చి వేశామన్నారు. ఎన్ కన్వేషన్ లో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువును పూర్తిగా కబ్జా చేసి కట్టడాలు నిర్మించారని వెల్లడించారు. ఈ భూములకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ చేసిన రిక్వెస్టును గతంలోనే అధికారులు తిరస్కిరంచారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.