తెలంగాణ

దానం నాగేందర్‌కు క్లాస్ పీకిన రేవంత్..ఏవీ రంగనాథ్‌కు సెల్యూట్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారా.. ఇకపైఅడ్డగోలుగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారా .. అంటే తాజాగా జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది. ఐపీఎస్ ఏవీ రంగనాథ్ కు వారం రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన దానం.. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం చర్చగా మారింది.సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకడంతోనే దానం నాగేందర్ మాట మార్చాడనే టాక్ వస్తోంది.

హైడ్రా దూకుడు ఇక మరింత వేగవంతం కానుంది. హైడ్రా బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ రంగనాథ్ మరింత సూపర్ పవర్ అయ్యారు. ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూల్చిపారేయాలని చెప్పారు. రాజకీయ నేతలున్నా ఎవరిని వదిలిపెట్టవద్దని ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇటీవల హైడ్రాకు వ్యతిరేకంగా.. ఐపీఎస్ రంగనాథ్ కు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దెబ్బకు దిగొచ్చాడు. హైడ్రాకు జై కొట్టాడు. ఐపీఎస్ రంగనాథ్ యాక్షన్ బాగుందన్నారు. అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందేనని కామెంట్ చేశాడు.

Read More : రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీకు డబ్బులు..!

జూబ్లిహల్స్ నందగిరి హిల్స్ లో హైడ్రా సిబ్బంది పలు కట్టడాలను తొలగించారు. ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారు. అయితే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానికులతో కలిసి ఆ ప్రహారిని కూల్చేశాడు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. నందగిరి హిల్స్ కొందరి నివాసాలను కావాలనే తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందన్నారు దానం నాగేందర్. అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు దానం. నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజేషన్ నోటీసులు ఇస్తానని దానం నాగేందర్ చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గతంలోనూ తనపై కేసులు పెట్టారని, ఇప్పటి కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. పేదల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానన్నారు.

దానం ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకెళ్తున్నామని తేల్చి చెప్పారు. తమకు ఎవరిపైన ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ కర్తవ్యమన్న రంగనాథ్.. అది సొసైటీది కాదు బస్తీ వాళ్లది కాదు.. ప్రభుత్వ ఆస్తి. దాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు.

Back to top button