దసరా పండుగ అంటేనే బంధువులందరూ కలిసి ఒక చోట ఎంతో ఆనందంగా కలిసిమెలిసి పండగ జరుపుకుంటారు. ఎక్కడో దూరంగా ఉంటున్న వాళ్లు కూడా తమ సొంత ఊర్లకు వచ్చి ఇళ్లల్లో చేసినటువంటి పిండివంటలు తినుకుంటూ ఎంతో ఆనందంగా దసరా పండుగని జరుపుకుంటారు. కానీ ఒకరి ఇంట్లో మాత్రం దసరా పండుగ శాపంగా మారింది. ఇద్దరు పిల్లల్ని బావిలో తోసేసి చనిపోయిన తండ్రి.
ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ లోని కామారేడ్డి జిల్లా నందివాడ గ్రామంలో దసరా పండగ పూట తీవ్రవిషాదం నెలకొంది. నందివాడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అలాగే అపర్ణ ఇద్దరు దంపతులు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి ఇల్లరికపు అల్లుడుగా ఆఫర్ నా ఇంటికి వచ్చాడు. అయితే పండగ పూట అత్తింటి వారు వాళ్ళ పిల్లలు ఇద్దరికీ బట్టలు తెచ్చారు. ఇక తండ్రి శ్రీనివాసరెడ్డికి తీసుకురాలేదు. ఇక వెంటనే శ్రీనివాస్ రెడ్డి నాకు కూడా బట్టలు కావాలని అతని అలాగే అపర్నని కోరాడు. అయితే వాళ్లు ఇప్పుడు డబ్బులు లేవు ప్రస్తుతానికి వీటితో సరిపెట్టుకోమని చెప్పారు. ఇక దీంతో మనస్థాపానికి గురై నేను ఇల్లరికం రావడం వళ్లే వీరు ఇలా చేస్తున్నారని అనుకోని వాళ్ల కొడుకులిద్దరిని తీసుకెళ్లి బావిలో పడేసి తను కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక దూరం నుంచి చూస్తున్నా మరో వ్యక్తి అతని కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక అక్కడికి చేరుకున్న గ్రామస్తులు అందరూ ముందుగా పిల్లలిద్దరిని బయటకు తీశారు. తరువాత శ్రీనివాస్ రెడ్డిని కూడా బయటికి తీశారు. ఇక దీంతో గ్రామంలో మొత్తం కంటతడి పెట్టుకుంది. అత్త అలాగే అపర్ణ వాళ్ళిద్దరు కూడా పిల్లలు ఇద్దరు విగతి జీవుల ఇప్పటికి ఉండడానికి చూసి బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు పై దర్యాప్తు చేస్తున్నారు.