క్రైమ్తెలంగాణ

సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యతో కలకలం..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఘటన

ఖానాపూర్, క్రైమ్ మిర్రర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్‌పేట్ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి (బీఆర్‌ఎస్) భర్త బండారి రవీందర్ (54) ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

గురువారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని పాకలో ఉరివేసుకుని రవీందర్ ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, చాలా సేపు తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుకుతుండగా పాకలో ఉరి వేసుకుని కనిపించడంతో కన్నీటి పర్యంతమయ్యారు.

సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భార్య ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా, ఈ ఘటన జరగడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రవీందర్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సంబంధిత కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఒక్కసారిగా ఏకకాలంలో చేసిన ఈ మృత్యానికి ప్రజలు షాక్‌కు గురయ్యారు. రవీందర్ మృతితో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

Back to top button