తెలంగాణ

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రెండు వారాల క్రితం తెలంగాణలో వర్షం కుమ్మేసింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా కురుసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. రెండు వారాల గ్యాప్ తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం నుంచి మూడు రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

శుక్రవారం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఉదయం ఎండకాసినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

ఇక శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ్నన సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. గత రెండు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచికొడుతున్నాయి.

Back to top button