తెలంగాణహైదరాబాద్

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు.జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Read Also : చండూరు సంతలో రెచ్చిపోతున్న సెల్ ఫోన్ దొంగలు…

వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని.. వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!
  2. యువత సన్మార్గంలో నడుచుకోవాలి…-వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్
  3. అలాంటి వాళ్లే రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు!!
  4. తప్పుడు ఆరోపణలు చేస్తే కబర్దార్…?..మన ఇద్దరిపై సిబిఐ దర్యాప్తు చెపిద్దాం―నువ్వు సిద్ధమా….?
  5. కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు… ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ!!

 

Related Articles

Back to top button