జాతీయంతెలంగాణ

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత నాలుగు నెలలుగా తీహార్ జైలులో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కేసులో ఇటీవలే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో గత అక్టోబర్ నుంచి పురోగతే లేదని కామెంట్ చేసింది. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్ల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ వస్తుందనే ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్సీ క‌విత త‌ర‌ఫున సుప్రీంకోర్టు సీనియ‌ర్ కౌన్సిల్, మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ వాదిస్తున్నారు. ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో నాలుగు రోజుల పాటు మకాం వేసి న్యాయవాదులతో చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కవిత త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తుందని చెప్పారు. కేటీఆర్ కామెంట్లు.. కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. కవితకు బెయిల్ వస్తుందన్న ఆశతో పలువురు మాజీ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు.

Read More : రేవంత్ రెడ్డికి మేథావుల షాక్.. మార్చాలంటూ రాహుల్ కు బహిరంగ లేఖ 

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్‌ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే అరెస్టు చేసింది.

Back to top button