క్రైమ్ మిర్రర్,తెలంగాణ బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గాయపడటంతో మూడు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత మళ్లీ గప్ చుప్ అయ్యారు. రైతు బంధు, రుణమాఫీపై గరంగరం రాజకీయాలు సాగుతున్నా కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. తన కూతురు ఎమ్మెల్సీ కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నా.. కేసీఆర్ వెళ్లి చూసి రాలేదు.
కేసీఆర్ సైలెంట్ తో బీఆర్ఎస్ కేడర్ లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోకేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు..? ఆయన ఎందుకు ఇంకా ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు..? బీజేపీలో విలీనం అంటూ ప్రచారం జరుగుతోన్నా ఎందుకు ఖండించడం లేదు..? కవిత బెయిల్ కోసమే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారా..? బీజేపీతో రాజీకీ సిద్దపడ్డారా..? తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొద్దికాలంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. అయితే దీనికి త్వరలోనే సమాధానం లభించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారని తెలుస్తోంది.
Read More : ఫాంహౌస్ బఫర్ జోన్‌లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుండటంతో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ అధినాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కవితకు బెయిల్ వచ్చాక కొద్దిరోజులకే కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత బెయిల్ కోసం కేసీఆర్ రాజీ పడ్డారు…? అనే విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. కవితకు బెయిల్ వచ్చాక అటు కాంగ్రెస్ , ఇటు బీజేపీకి వ్యతిరేకంగా స్వరం వినిపించి…కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చేరిపేసుకునేలా కేసీఆర్ దూకుడుగా రాజకీయాలు చేస్తారని అంటున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఇదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లనుందని వాదనలు వినిపిస్తిన్నాయి.