
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. తన కొడుకు మార్క్ శంకర్ , భార్య లెజినోవాతో కలిసి సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టురు వచ్చారు. ఆనారోగ్యం నుంచి కోలుకున్న మార్క్ శంకర్.. తల్లిదండ్రులు పవన్, అన్నా లెజినోవాతో కలిసి మార్క్ శంకర్ వచ్చారు. మార్క్ శంకర్‌ను పవన్ కల్యాణ్ ఎత్తుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకున్నాడు.
ఈనెల 8న సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. మార్క్ శంకర్‌ను చూసేందుకు ఈనెల 9న హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్‌కల్యాణ్. ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో.. కుమారుడిని తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. సింగపూర్ ఆస్పత్రిలో మార్క్ శంకర్‌కి నాలుగు రోజులపాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకో స్కోపీ చేశారు వైద్యులు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..