చెరువులు, ప్రభుత్వ భూముల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా ఎక్కడా తగ్గడం లేదు. వారం రోజులుగా హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గ్రేటర్ పరిధిలోని చెరువులను పరిశీలిస్తూ ఎల్ఎఫ్టీ, బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను గుర్తిస్తున్నారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చెరువులను పరిశీలిస్తున్న రంగనాథ్ టీం.. అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తోంది.
ఇప్పటికే మాదాపూర్ లో టాప్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది.తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు.భాగీరథమ్మ చెరువు ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
జయభేరీ సంస్థ ప్రముఖ హీరో మురళీమోహన్ కు చెందనది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీమోహన్. చంద్రబాబుకు బినామీగా జయభేరీ సంస్థను చెబుతుంటారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ జయభేరీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇవ్వడం సంచనంగా మారింది.