తెలంగాణ

అసెంబ్లీకి కేసీఆర్!ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కానున్నయి. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా లేదా అన్నది చర్చాగ మారింది. అధికారం పోయాక ఒకసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు గులాబీ బాస్. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం రోజు సభకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పిలుపిస్తున్నారు. కాని కేసీఆర్ మాత్రం అసెంబ్లీని లైట్ తీసుకుంటున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ యాక్టివ్ కావడంతో ఆయన ఈసారి అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొంటారనే టాక్ నడుస్తోంది. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో కేసీఆర్ అధ్యక్షతన BRSLP భేటీ జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.ఒకేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

మరోవైపు సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎర్రవెల్లి కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లి స్వయంగా కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రి. పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులు కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించామని మంత్రి పొన్నం చెప్పారు. ప్రభుత్వం పక్షాన మర్యాదగా అందరినీ గౌరవించుకుంటామన్నారు. విగ్రహ ఏర్పాటు పై ఎలాంటి చర్చ జరగలేదని పొన్నం తెలిపారు. భోజన సమయంలో రావడం వల్ల వారి ఆహ్వానం మేరకు భోజనం చేశామని పొన్నం తెలిపారు.

Back to top button