ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

చంద్రబాబుతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా తెలంగాణపై ఫోకస్ చేశారు. నెలలో ఒకటి, రెండు సార్లు తెలంగాణ నేతలతో సమావేశమవుతున్నారు. త్వరలో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన టీడీపీ.. ఆ తర్వాత తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ బరిలోకి నిలవలేదు. ఏపీలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ పరిస్థితుల్లోనూ తాజాగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

ఏపీ‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనుండటం ఆసక్తిగా మారింది. మాజీమంత్రి, మేడ్చల్ చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు, మల్లారెడ్డి తన మనవరాలు పెళ్ళికి చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అయితే కొన్ని రోజులుగా మల్లారెడ్డి తిరిగి టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. 2014లో టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు మల్లారెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు నెలల క్రితం కూడా చంద్రబాబును కలిశారు మల్లారెడ్డి.

Read More : కేసీఅర్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్

మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఎమ్మెల్యే మాధవరం కూడా టీడీపీలో సుదీర్ఘకాలం పని చేశారు. టీడీపీ నుంచి మున్సిపల్ చైర్మెన్ గా పని చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బీఆర్ఎస్ లో చేరినా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మాధవరం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు గెలిచాకా ఈ మూడు నెలల్లోనే నాలుగైదు సార్లు చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తిరుమల దర్శనం లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేయడానికే మాధవరం కలుస్తున్నారని చెబుతున్నా… రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button