జూనియర్ ఎన్టీఆర్‌కు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. దేవర సినిమా టికెట్ రేట్లు, షోల పెంపుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత టికెట్ రేట్ల కంటే అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ 110 రూపాయలు.. లోయర్ క్లాస్ టికెట్ ను 60 రూపాయలకు పెంచేందుకు. మల్టీప్లెక్స్ లో 135 రూపాయలకు పెంచుకునేందుకు 14 రోజులకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
సినిమా రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షో తో 6 షోలకు.. ఆ తర్వాత 9 రోజులు 5 షోలకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కృతజ్ఞతలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.