
క్రైమ్ మిర్రర్, జగిత్యాల :- ఎన్నికల గాలులు వీచడం మొదలయ్యాక గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పొలాలు, పంటలు, పంట సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు పల్లెల్లో మాట్లాడేది ఒక్క మాటే — ఎన్నికలు! “ఎవరు గెలుస్తారు? ఎవరు టికెట్ తెచ్చుకుంటారు? ఎవరు ఎవరితో ఉంటారు?” అన్నది ప్రజల్లో కుతూహలంగా మారిపోయింది. పార్టీ నేతల్లో ఘర్షణలు – టికెట్ కోసం కోలాహలం.. పార్టీల్లో అంతర్గత రాజకీయాలు బాహాటమయ్యాయి. ఒకే పదవికి పలువురు ఆశావహులు బరిలో ఉండడంతో, గ్రామాల్లో రాజకీయ చర్చలు శిబిరాలుగా మారుతున్నాయి.
వరి తోట దగ్గర కనబడితే గుంపు…
గ్రామసమీతి దగ్గర కూర్చుంటే శిబిరాలు…
పార్టీ నేతల ఇళ్లలో రాత్రి రహస్య సమావేశాలు, మధ్యవర్తుల గుమ్మానికి వాహనాల రాకపోకలు పెరగడంతో గ్రామాలు పూర్తిగా రాజకీయ శిబిరాలుగా మారిపోయాయి.
నామినేషన్లకు ముందే ‘మొక్కుల’ పండుగ ఓటర్లను కట్టిపడేయడానికి అభ్యర్థుల పందాలు ప్రారంభమయ్యాయి. నామినేషన్లకు ముందే హామీల రెయిన్‌తో పాటు మొక్కుల పండుగ జోరందుకుంది:
✔️ ఆలయాల వద్ద మొక్కులు
✔️ సంఘాలకి విరాళాలు
✔️ గౌరవసూచక పూలచందాలు
✔️ తాగునీరు – లైటింగ్ ఏర్పాటు
✔️ హామీల రెయిన్
✔️ కొంతమంది ప్రజలు ఊరి సమస్యల కోసం పోరాటం చేసినప్పుడు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరు కూడా స్పందించ లేదు స్వలాభాల కోసం ఓట్లు అడగడానికి వస్తున్నారా ప్రశ్నించాలని కొందరు.
“ఈసారి మా వారి దే” అని అరుస్తూ ఓటు కోసం నోట్లు, మాటలు, బంధాలు పరుగులు తీస్తున్నాయి.
ఎక్కడ చూసినా ఎన్నికల సందడే
పల్లెల్లో ప్రతి మూలా ఎన్నికల సందడే కనిపిస్తోంది:
➡️ చర్చలు చెలరేగే చౌరస్తాలు
➡️ మొబైల్ డేటాతో సోషల్ మీడియా క్యాంపెయిన్లు
➡️ సాయంత్రాలు ‘టీ స్టాల్’ రాజకీయాలు
➡️ పెద్దాపెద్దల జోక్యాలు, జాతి సమీకరణ లెక్కలు
ఎవరెవరికీ వ్యతిరేకంగా మాట్లాడినా… ఎవరో వీడియో తీస్తారనే భయం… నవ్వులు, అభినందనలు అన్నీ రాజకీయ వలపునే తలపిస్తున్నాయి.
ప్రజలు మాత్రం ఆశతో ఎదురు
ఒకవైపు ఈ రాజకీయ సందడి నడుస్తుండగా, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి:
— రోడ్లు ఎప్పుడు బాగవుతాయి?
— నీరు ఎప్పుడు వస్తుంది?
— ఉద్యోగం ఎప్పుడు?
— ఇళ్లు ఎప్పుడు?
అభ్యర్థులు మాత్రం ప్రతిజ్ఞల వరదతో “ఇవన్నీ గెలిచాక చేస్తాం” అని హామీల హంగామా సృష్టిస్తున్నారు. ఎన్నికల వేడిలో మండుతున్న గ్రామాలు.
పార్టీల శిబిరాలు జోరందుకుంటున్నాయి. ఓటర్ల లెక్కలు పెరిగిపోయాయి. కుర్రకారే కాదు, పెద్దలు కూడా రాజకీయాల్లో మునిగిపోయారు. ఎన్నికల బరిలో ఎవరు గెలుస్తారు? గుర్తులు మాత్రమే మారతాయేమో… కానీ గిన్నెలు బద్దలవ్వడం మాత్రం ఖాయం!
Read also : Medical Miracles: వ్యక్తి కడుపులో కండోమ్.. కట్ చేస్తే..





