
-
శోకసముద్రంలో మునిగిన సుద్దాల గ్రామం..
గుండాల, జనవరి 27(క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల సుద్దాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు యమగాని బక్కయ్య మంగళవారం జీవనోపాధి కోసం తాటిచెట్టుపైకి ఎక్కి కళ్లు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడిపోయాడు.
ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వైద్య సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బక్కయ్యను జనగామ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు సమాచారం.బక్కయ్య మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.రోజువారీ కష్టపడి పనిచేసే గీత కార్మికుడి అకాల మరణం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గ్రామస





