నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మంగళవారం ఓ పోలీస్ అధికారి మీద క్రైమ్ మిర్రర్ పత్రికలో వచ్చిన కధనంపై నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పందించారు. ఈ నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్ లను తానే స్వయంగా తనిఖీ చేస్తూ విచారిస్తున్నారు.. బాధ్యత గల పోలీస్ వృత్తి చేస్తూ, బాధిత మహిళను హతం చెయ్యాలని అతగాడు ఇచ్చిన ఉచిత సలహాపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్నటి నుండే విచారణ మొదలు పెట్టిన ఆయన, చండూర్ పోలీస్ సిబ్బందిని విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. బాద్యులు ఎవరైనా సరే చర్యలు తప్పవని ఆయన అన్నారు. పలు పోలీస్ స్టేషన్ ల సందర్శన తరువాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనా ఒక దళిత మహిళాపై హత్యా ప్రయత్నం చెయ్యాలని సలహా ఇచ్చిన పోలీస్ అధికారిపై, ఫోన్ లో మాట్లాడిన అవతలి వ్యక్తితో పాటు, దానికి సంబంధం ఉన్న ఉన్నత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
చర్యలు తీసుకోని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని అంటున్నారు. క్రైమ్ మిర్రర్ పత్రిక కధనంపై వెంటనే స్పందించి స్వయంగా తానే విచారణ చేస్తున్న ఎస్పి శరత్ చంద్ర పవార్ ను పలువురు అభినందిస్తున్నారు. యంగ్ డైనమిక్ ఆఫీసర్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.