తెలంగాణ

కోమటిరెడ్డి సక్సెస్.. వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో ముందడుగు

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకున్నది సాధిస్తున్నారు. ఆయన కృషితో వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీఓ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది ఆర్ & బీ శాఖ.

వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని విరమించుకుంది జీఎమ్మాఆర్ సంస్థ. పీపీపీ పద్దతిలో శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన జీఎంఆర్.. ఆ సమయంలో మరీ కండీషన్ పెట్టింది. శంషాబాద్ కు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం కట్టవద్దన్నది ఆ కండీషన్. ఇదే ఇప్పటివరకు వరంగల్ విమానాశ్రయానికి పెద్ద అడ్డంకిగా నిలిచింది. ఇప్పుడు జీఎంఆర్ ఆ ప్రతిపాదనను విరమించుకోవడంతో వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియరైంది.

ఇప్పటికే వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశేష కృషి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడిందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button