అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ సహా పలు కీలక అంశాలపై ఢిల్లీలో ఏం జరుగుతుందో చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదని..అందుకే అసెంబ్లీ వస్తలేడని అన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నపుడు భట్టి విక్రమార్క వచ్చారు.. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేడు..? కొడుకు , అల్లుడు, బిడ్డలను పట్టించుకొవాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు.
రాజకీయాల్లో హుందాతనం అవసరం.. కేటీఆర్, హరీష్ రావు కు అవి లేవని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. డీలిమిటేషన్ లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజాన్ చౌదరి పార్లమెంట్ కి వెళ్లారని అన్నారు. బడ్జెట్ సమావేశాల వరకు కౌన్సిల్, అసెంబ్లీ నిర్వహించడానికి రెడీగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరని.. ఈ విషయం పార్టీ అధిష్టానం, సీఎందే నిర్ణయం అన్నారు. పాలమూరు నుంచి శ్రీహరి కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని.. ఇది చెప్పగలనని కోమటిరెడ్డి అన్నారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కల్వకుర్తి లో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారని.. నా మీద ఎంపీగా గెలిచేందుకు బురా నర్సయ్య కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల లో ఎన్ని రోజులు అసెంబ్లీ పెట్టారు.. మేము ఎన్ని రోజులు అనేది అసెంబ్లీ రికార్డ్ లో ఉంటుంది కదా అన్నారు. ఎన్ని రోజులు అనేది కాదు ఎన్ని గంటలు జరిగింది ఎన్ని చర్చలు జరిగాయి అనేది ముఖ్యమన్నారు. ఉద్యమం లో ఆయనకి అగ్గిపెట్టే దొరక లేదట ఊర్లో బీడీ , సిగరెట్ , సుట్ట తాగే వాళ్ళు ఉంటారు ఎవడ్ని అడిగిన అగ్గిపెట్టే ఇస్తారంటూ హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని అన్నారు. మంత్రిగా ఏ ప్రశ్నకైనా తాను జవాబు యిస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో పరపతిలేని కెటిఆర్, హరీష్ గురుంచి మాట్లాడొద్దని సీఎం గారికి సూచించా.. అందుకే పాలమూరు, నల్గొండ లో మాట్లాడలేదని చెప్పారు. పబ్లిక్ లో వీళ్ళు ఇద్దరు జోకర్లు గా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.