తెలంగాణ

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

అర్ధరాత్రి తర్వాత నాలుగు గ్రామాల్లోకి ప్రవేశించిన వందలాది మంది పోలీసులు.. ఇంటింటి తిరిగి గాలించారు. దాడిలో పాల్గొన్న వారితో పాటు పరోక్షంగా సహకరించిన మొత్తం 300 మందిని అదుపులోనికి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తో పాటు కొడంగల్ డెవలప్ మెంట్ ప్రత్యేక అధికారిపై దాడి ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అర్ధరాత్రి తర్వాత నాలుగు గ్రామాల్లోకి ప్రవేశించిన వందలాది మంది పోలీసులు.. ఇంటింటి తిరిగి గాలించారు. దాడిలో పాల్గొన్న వారితో పాటు పరోక్షంగా సహకరించిన మొత్తం 300 మందిని అదుపులోనికి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆందోళనలో పాల్గొన్న ఐదు గ్రామాల పరిధిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్ నెట్ సేవలను కూడా పోలీసులు నిలిపివేశారు.

రైతుల దాడిలో పలువురు అధికారులకు గాయాలు అయ్యాయి. ఫార్మాకంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణపై లగచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు.

మరోవైపు ప్రభుత్వ తీరు అమానుషం …లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలిని మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ఫార్మా భూసూకరణకు నిరాకరించిన వాళ్లను పోలీసులతో బెదిరించాలని చూడటం దారుమమన్నారు. అర్థరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం ఏంటన్ని ప్రశ్నించారు హరీష్.

మరిన్ని వార్తలు చదవండి .. 

నటుడు పోసాని అరెస్ట్ కు రంగం సిద్దం!

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button