తెలంగాణ

కొండా సురేఖపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. హీరో నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు ఎన్టీఆర్‌.మంత్రి కొండా సురేఖపై ఆయన మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని తారక్ వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖపై మండిపడుతూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్..

“కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో.. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా సినీ పరిశ్రమపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మనం దీని కంటే పైకి ఎదగాలి. ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగించాలి. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు

Back to top button