తెలంగాణ

కేసీఆర్ కనిపిస్తలేడు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో!

కేటీఆర్- సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాక రాజేశారు మంత్రి కొండా సురేఖ. ఆమె కామెంట్లపై టాలీవుడ్ ప్రముఖలంతా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో కౌంటరిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొండా సురేఖ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన కొండా.. సమంతకు క్షమాపణ చెప్పింది. తన మాటలను వెనక్కి తీసుకుంది. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరోసారి కేటీఆర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. ఈసారి కేసీఆర్ ను కూడా లాగారు.

చాలా రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదన్నారు కొండా సురేఖ. కేసీఆర్ ఎలా ఉన్నారో ఏమో.. కేటీఆర్ ఆయన గొంతు పిసికి చంపేశాడేమో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనిపించకపోవడంతో తనకు కేటీఆర్ పై అనుమానం వస్తుందన్నారు కొండా సురేఖ. కేటీఆర్‎కి పదవి కాంక్ష ఎక్కువ.. కేసీఆర్‎న్ని ఫామ్ హౌజ్ లోపల కేటీఆర్ గొంతు పిసికిండో ఎమోనన్న అనుమానం వస్తుందని తీన్మార్ మల్లన్న అంటున్నారు.. మరీ తీన్మార్ మల్లన్న అనుమానం వ్యక్తం చేసినట్లు ఫామ్‎హౌస్‎లో ఏం జరిగిందో ఏమో కానీ.. గత కొన్ని రోజులుగా కేసీఆర్ మాత్రం కనిపించడం లేదని మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో కేసీఆర్ సీఎం పదవి కోల్పోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు మంత్రి కొండా సురేఖ. పవర్ పోయే సరికి కేటీఆర్‎కి మతిభ్రమించి తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ అంటూ కేటీఆర్ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నాడని.. అస్సలు మూసీ ప్రక్షాళనకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకిస్తూ ప్రజల్లో ప్రలోభాలకు తెరలేపితే ఊపేక్షించబోమని.. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని కేటీఆర్ ను హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ.

 

Back to top button