తెలంగాణ

కేటీఆర్ జైలుకైనా!… హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్‌లో టెన్షన్!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ న్యూ ఇయర్ లో జైలుకు వెళ్లడం ఖాయమా.. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. ఫార్ములా ఈ రేస్‌ కేసుకు సంబంధించి ఏసీబీ నమేదు చేసిన కేసును క్వాష్‌ చేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో కార్ రేస్ కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు ఇప్పటికే ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ, తుది తీర్పు కోసం నేడు కీలకంగా మారింది. ఈ తీర్పు కేటీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.

Also Read : గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..

కేటీఆర్‌పై నమోదైన కేసు సరైన ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారని సమాచారం. మరోవైపు, ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరపాల్సిందిగా అధికార పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు కొట్టివేయడంపై కోర్టు ఏమి నిర్ణయిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చే తీర్పు కేటీఆర్ అరెస్ట్‌పై ప్రభావం చూపవచ్చు. కేటీఆర్ కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వస్తే రేపు లేదా ఎల్లుండి కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు ఫార్ములా ఈ రేస్‌ కేసులోనే విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపించింది. ఏసీబీ ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.. జనవరి 6న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు పంపించింది.

ఇవి కూడా చదవండి : 

  1. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
  2. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  3. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
  4. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button