తెలంగాణ

కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు.. రెచ్చిపోయిన రేవంత్

సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అడ్డగోలుగా వేలకోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం ఏం తెలుస్తుందన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే… కేటీఆర్ సిద్దిపేటలో ఇడ్లీ,వడ అమ్ముకునే వాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడన్నారు.రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారని రేవంత్ రెడ్డి అన్నారు.

అధికారం పోయినా తండ్రికొడుకులకు మదం దిగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గుల్లా పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని, పదవులు పంచుకున్న వాళ్లా కుటుంబ పాలన గురించి మాట్లాడేదని ధ్వజమెత్తారు. గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పింది.. ఐలమ్మ స్పూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా..మీ ఫామ్ హౌస్ లలో జిల్లెళ్ళు మొలవాల్సిందే అన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని చెప్పారు. వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టు కున్న మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్లు సరిపోలేదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

మేం రాజీవ్ విగ్రహం పెడతామనాగానే వీళ్లకు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందట అంటూ సీఎం రేవంత్ సెటైర్లు వేశరు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టడం సముచితం కాదా అని తెలంగాణ ప్రజలను అడుగుతున్నా అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు.. ఎవడ్రా తొలగించేది… ఎవడొస్తాడో చూస్తా అంటూ రేవంత్ సవాల్ చేశారు. పదేళ్లు మీకు సోయి లేదు కాబట్టే… మేం సచివాలయంలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి చూపిస్తామన్నారు. ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపుకు కూడా వెళ్లని దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. కానీ మేం IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని తెలిపారు. అధికారం పోయిందన్న అక్కసుతో కేసీఆర్.. కొంతమంది చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్లమీదకు రాబోతోందని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమలాని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button