తెలంగాణ

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లో సురేష్ ఈ కుట్ర చేశారని ఆరోపించారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు ఫోన్ లో మాట్లాడారని.. అదే సమయంలో కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారని రిమాండ్ రిపోర్టులో

లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్ పై దాడి ఘటనలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. దాడిలో పాల్గొన్న 46 మంది రైతులు పరిగి జెైలులో ఉన్నారు. ప్రధాన నిందితుడు సురేష్, దేవదాస్ సహా మరో 8 మంది పరారీలో ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పొందు పరిచారు పోలీసులు. పక్కా ప్లాన్ తోనే కలెక్టర్ పై దాడి చేశారని చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లో సురేష్ ఈ కుట్ర చేశారని ఆరోపించారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు ఫోన్ లో మాట్లాడారని.. అదే సమయంలో కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. దాడి కేసులో కేటీఆర్ హస్తం ఉందని.. ఆ దిశగా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు పోలీసులు.

రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ ప్రస్తావన తేవడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగింది. దీంతో బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని కేటీఆర్ ఇంటి వ‌ద్ద అర్దరాత్రి హై డ్రామా నెలకొంది. పోలీసులు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తున్నారన్న ప్రచారంతో కేటీఆర్‌ ఇంటి వద్దకు BRS కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల వరకూ ఈ హడావిడి కొనసాగింది. వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్ట్‌ అయిన BRS నేత పట్నం పరేందర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కేటీఆర్‌ పేరు వుందన్న ప్రచారం తో…ఆయనను అరెస్ట్‌ చేయబోతున్నారని భావించిన నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. భారీగా తరలిస్తున్న BRS కార్యకర్తలను చూసి ఏం జరుగుతుందో తెలీక పోలీసులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఫుల్లుగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ట్రాఫిక్ ఏసీపీ

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button