తెలంగాణ

కేటీఆర్‌ను ఇరికించిన లెక్క ఇదే.. డబ్బులు ఎలా వెళ్లాయంటే..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దమైంది. ప్రభుత్వ ఆదేశాలతో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ విచారణ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. ఏసీబీ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ అయితే అంత ఈజీగా బెయిల్ వచ్చే పరిస్థితులు ఉండవని తెలుస్తోంది.

కేటీఆర్ FIRలో కీలక అంశాలు ఉన్నాయి.. ఏ విధంగా మనీ విదేశా సంస్థల ఖాతాల్లోకి వెళ్లిందో వివరించింది..

FIR నెంబర్ 12/ RCO- CIU- ACB 2024..

పీసీ యాక్ట్, ఐపిసి యాక్ట్ కింద కేసులు నమోదు..

13(1)(A)13(2)PC ACt, 409, 120B IPC సెక్షన్స్ కీంద కేసు నమోదు..

నిన్న సాయంత్రం ఏసీబీకి 5:30కు అందిన ఫిర్యాదు..

ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్ సెక్రటరీ MAUD ఐఏఎస్ అధికారి దాన కిషోర్..

ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కేసు నమోదు..

అవకతవకలపై ప్రభుత్వం విచారణ చెయ్యగా బయటపడ్డ అవకతవకలు..

ప్రభుత్వ నిధులు 54 కోట్ల 88లక్షల 87వేల043 అక్రమ బదిలీలు..

యూకే కి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ..

రెండు విడతల్లో చెల్లింపు.. మొదట 3/10/2023న 22కోట్ల 69లక్షల 63వేల 125..

రెండవ విడత 11/10/2023 న 23కోట్ల 01 లక్షల 97వేల 500బదిలీ..

హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి బదిలీ..

విదేశీ కంపెనీకీ చెల్లింపులతో hmda కు అదనపు పన్ను భారం..

8కోట్ల 6 లక్షల 75వేల 404అదనపు పన్ను భారం పడింది..

10కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాక అనుమతి అవసరం..

సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్ కు స్పాన్సర్స్ లేక పోవడంతో HMDA నిధులు మల్లించారు

Back to top button