తెలంగాణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి.. రేవంత్ కు వార్నింగ్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు ఘోర అవమానం జరిగింది. ఆయనపై సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కోడి గుడ్లతో దాడి చేశారు.‌ కార్యకర్తల దాడితో ఆయన పారిపాయారు.

చేవెళ్ల నియోజకవర్ షాబాద్ లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ని అడ్డుకున్నారు కాంగ్రెస్ వర్గీయులు. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చారని‌ ప్రశ్నించారు. గత పది సంవత్సరాల నుండి షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీశారు.

బిఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకొని. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావంటూ కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.ఎమ్మెల్యే అనుచరులకు నామినేట్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే యాదయ్యపై దాడి చెసింది చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ భీం భరత్ వర్గీయులుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని యాదయ్య అనుచరులు డిమాండ్ చేశారు.

Back to top button