తెలంగాణ

కవితకు సీఎం రేవంత్ గిఫ్ట్.. మాజీ మంత్రి మల్లారెడ్డి జంప్?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లి 165 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కవిత.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి భారీ ర్యాలీ తీశారు. పార్టీ నేతలంతా వెంటరాగా ఇంట్లోకి అడుగుపెట్టిన కవిత.. తనను టార్గెట్ చేసిన వాళ్ల సంగతి తేలుస్తానని శపథం చేశారు. అయితే ఆవేశంగా మాట్లాడిన కవితకు సీఎం రేవంత్ రెడ్డి ఖతర్నాక్ గిఫ్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కవిత ఇంటికి వచ్చిన సంతోషం కేసీఆర్ కుటుంబంలో ఎక్కువ కాలం ఉండకుండా స్కెచ్ వేశారంటున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ కు బైబై చెప్పి కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే టాక్ వస్తోంది. అయితే సమయం కోసం చూస్తున్న రేవంత్.. కవిత బెయిల్ పై రాగానే మల్లారెడ్డి చేరికకు ఓకే చెప్పారని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే మామఅల్లుళ్లు కాంగ్రెస్ లో చేరడానికి ముహుర్తం ఫిక్స్ చేశారని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయినందునే కవిత స్వాగత కార్యక్రమానికి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. కవితకు బెయిల్ పక్కాగా వస్తుందన్న సమాచారంతో కేటీఆర్, హరీష్ రావుతో కలిసి దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. కాని అందులో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి లేరు. కేటీఆర్ కార్యక్రమాలకు రాజశేఖర్ రెడ్డి ఖచ్చికంగా హాజరవుతుంటారు. కాని ఆయన ఢిల్లీలో మాత్రం కనిపించలేదు.

ఢిల్లీకి వెళ్లని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి.. కవితను రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర కూడా కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ కావడం వల్లే మల్లారెడ్డి కవితను కలిసేందుకు వెళ్లలేదని ఆయన అనుచరుల్లో కూడా చర్చ సాగుతోంది.

మరోవైపు మర్రి రాజశేఖర్ రెడ్డిచి చెందిన MLRIT , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.దుండిగల్ పరిధిలో ఉన్న చిన్నదామెర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం జరిగిందని.. దీనికి సంబంధించి మీ వివరణ ఏంటీ అంటూ నోటీసుల ద్వారా ప్రశ్నించారు అధికారులు. చెరువు భూముల్లో భవనాలు, షెడ్స్, వాహనాల పార్కింగ్ నిర్మాణాలు చేపట్టారని.. రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లో కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు. నోటీసులు రావడంతో భయపడిన మల్లారెడ్డి, మర్రిలు అధికార పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

Back to top button