క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ తగలబోతోంది. కరెంట్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. కరెంట్ చార్జీల పెంపుపై విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్తు ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలుగా పిలిచే డిస్కంలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. మొత్తం మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ERC ఆమోదిస్తే… లోటును పూడ్చుకోవడానికి 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇళ్లకు వాడే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ వసూలు స్తారు. అది ప్రస్తుతం 10 వసూలు చేస్తున్నారు. దాన్ని 50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి.
Read More : సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారి ఆంటీ.. ఎందుకో తెలుసా
రేవంత్ రెడ్డి సర్కార్ గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ స్కీం అమలు చేస్తోంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు రెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. వైట్ రేషన్ కార్డులు ఉన్న వినియోగదారులకు ఈ పథకం అమలవుతోంది. విద్యుత్ సంస్థలు తాజాగా చేసిన ప్రతిపాదన ప్రకారం గృహజ్యోతి పథకంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి ఫిక్స్‌డ్ ఛార్జీ పెంపు ఉండదు. అంటే 3 వందల యూనిట్ల కరెంట్ వాడే వినియోగదారులకు ఎలాంటి నష్టం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారని సమాచారం.దీంతో కరెంట్ చార్జీలు పెరిగినా అది కమర్షియల్ తో పాటు 20 శాతం గృహ వినియోగదారులపై మాత్రం ప్రభావం చూపనుంది.