
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- పత్రీజీ ధ్యాన మహాయాగంలో బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్యాత్మిక సందేశాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాలుగో రోజు ధర్మదేవత అనే అంశంపై సందేశం విన్పించారు. ఈ సృష్టి మొత్తం ధర్మదేవతతో నడిపించబడుతుందని తెలిపారు. ధర్మాన్ని తెలుసుకున్న వారంత ధర్మదేవతగా తయారువుతారన్నారు. ఆధర్మాన్ని కొంత వరకు సహించడం కూడా ఒక ధర్మమని తెలిపారు. ధర్మదేవత కొంత వరకు ఆధర్మాన్ని సహిస్తుందని, అయితే మితిమీరితే శిక్షిస్తుందని స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలని కోరారు. అలాగే ప్రయోగం అనే అంశం గురించి వివరించారు. ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదని ప్రయోగం చేసి నమ్మాలని సూచించారు.ప్రయోగం, అనుభవం, వ్యక్త పరిచడం అనే మూడు ద్వారా మనం పురోగతి చెందుతామని, వికాసం చెందుతామని తెలిపారు. మనం దేనిపైన అయితే దృష్టి పెడుతామో ఆదే లభిస్తుందని శ్రేయన్ దాగా అన్నారు. ధ్యానంలో మనుసు ఎప్పడైతే శూన్యమవుతుందో మనని మనం తెలుసుకోగల్గుతామన్నారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వాహకులు శ్రేయన్స్ దాగా ప్రీతీజీ ధ్యాన మహాయాగంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన ఆయన మనం అనవసరమైన వాటిపైన దృష్టి పెడుతూ మన ఎనర్జీని కోల్పోతున్నామని తెలిపారు. మనం దేనిపైన అయితే దృష్టి పెడుతామో ఆదే జరుగుతుందని వివరించారు. కష్టాలు, సవాళ్లు వస్తే ఆందోళన చెందకుండా పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. మనం ఏదైన ఇతరుల నుంచి ఆశించి ఆది లభించకపోతే మనలో వ్యతిరేక ఆలోచనలు పెరుగుతాయని అందుకే ఎవరి నుంచి కూడా ఏది ఆశించకూడదని స్పష్టం చేసారు.

సంగీతా కళాకారుడు సంజయ్ సింగికి సన్మాన కార్యక్రమం
తన సంగీత నాధ్య ధ్యానంతో ధ్యానులను విశేషంగా అలరిస్తున్న సంగీతకళాకారుడు సంజయ్ సింగి బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఫౌండర్ బుద్ద సీఈవో క్వాంటమ్ ఫౌండేషన్ పి.చంద్రశేఖర్, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

పీఎంసీ క్యాలెండర్, ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
పత్రీజీ ధ్యాన మహాయాగంలో పీఎంసీ న్యూఇయర్ క్యాలెండర్ ను మాస్టర్ శ్రేయన్స్ దాగా చేతుల మీదుగా ఆవిష్కరించారు. 8 సంవత్సరాల పీఎంసీ చరిత్రపై రూపొందించిన పీఎంసీ సావనీర్ ను ది పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ధ్యానమాతృత్వం పుస్తకం సంగీతకళాకారుడు సంజయ్ కింగి ఆవిష్కరించగా, పత్రీజీ ధ్యానమృతం పుస్తకాన్ని విజయభాస్కర్ రెడ్డి విడుదల చేసారు. బాలవికాస్ సాంగ్ ను ఆవిష్కరించారు.





