తెలంగాణ

ఒవైసీ బ్రదర్స్‌పై ముస్లింల తిరుగుబాటు!రేవంత్‌కు పాతబస్తీలో ఫుల్ సపోర్ట్

చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మణాలు చేపట్టిన భవనాలను హైడ్రాతో కూల్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి క్రేజీ రోజురోజుకు పెరుగుతోంది. హైడ్రాకు ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. పాతబస్తీని తన అడ్జాగా భావిస్తున్న ఒవైసీ బ్రదర్స్ పై తిరుగుబాటు వస్తోంది. ఎంఐఎం ఎం చీఫ్ అసదుద్దీన్ అక్రమ నిర్మాణాలపై స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తున్న పాతబస్తీ యువకులు, ముస్లిం సంఘాలు.. అసద్ బ్రదర్స్ అక్రమంగా నిర్మించిన కాలేజీ భవనాలను నేలమట్టం చేయాలని కోరుతున్నారు. చెరువుల్లో నిర్మించిన భవనాలే కాదు వక్ఫ్ భూములను ఒవైసీ బ్రదర్స్ కబ్జాల నుంచి రక్షించాలని కోరుతున్నారు.

ముస్లిం సంఘాలు ధైర్యంగా ముందుకు వస్తూ ఒవైసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. మేకు మేం అండగా ఉంటాం.. అక్రమ కట్టడాలను కూల్చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. తాజాగా అసద్ కు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ముందుకు వచ్చింది. హైడ్రాకు వ్యతిరేకంగా ఓల్డ్ సిటీ జనాలను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రెచ్చ గొడుతున్నారని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్​ మహ్మద్​ ఇస్లాముద్దీన్ ఆరోపించారు.

పాతబస్తీతో పాటురాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్​ బోర్డు, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రాకు అనుమతి ఇవ్వాలని డాక్టర్​ మహ్మద్​ ఇస్లాముద్దీన్ సీఎం రేవంత్​ రెడ్డిని కోరారు. ఒవైసీ బ్రదర్స్ మాటలను ముస్లింలు నమ్మే స్థితిలో ఇప్పుడు లేరన్నారు. అసద్, అక్బర్ ఆటలు ఇక పాతబస్తీలో సాగవన్నారు ఇస్లాముద్దీన్. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ పేరుతో చేసిన కబ్జాలాపై అసద్ సమాధానం చెప్పాలన్నారు. -హైడ్రాతో గత 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారు. ఒవైసీ బ్రదర్స్ కు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలే బయటికి రావడం చర్చగా మారింది.

Back to top button