హైడ్రా కూల్చివేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. చెరువుల్లో అన్ని కట్టడాలను కూల్చేస్తామన్నారు. ఎవడి నిర్మాణాలు ఉన్నా తమకు సంబంధం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్టి. చెరువులను పునరుద్ధరించడమే తమ లక్ష్యమన్నారు.
నేను రేవంత్ రెడ్డిని .. నాకు కేసీఆర్ పోలిక ఏంటి అన్నారు తెలంగాణ ముఖ్య మంత్రి. పార్టీ లతో సంబంధం లేకుండా హైడ్రా తన పని తానుచేసుకుంటూ పోతుందన్నారు.
ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో కవితకు కేవలం ఐదు నెలల్లో బెయిల్ ఎలా వచ్చిందన్నారు. రుణమాఫీ మీద హరీష్ రావు, కేటీఆర్ గ్రామాల్లో కి వెళ్లాలని సూచించారు సీఎం రేవంత్. రుణమాఫీపై హరీశ్ రావు కు మాట్లాడే నైతికత లేదన్నారు.
వాల్మీకి స్కామ్ లో టీఆరెస్ వాళ్ల కు లింకులు ఉండొచ్చని రేవంత్ కామెంట్ చేశారు. డ్రగ్స్ కోసం కొంతమంది టిఆర్ఎస్ నేతలు బెంగుళూరుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఇచ్చిన హామీలపై ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చ పెడతారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అసెంబ్లీ కి రాకుండా పారిపోవద్దని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ను వాళ్ళ నాన్న కూడా నమ్మడన్నారు.తాను కోస్గి, కొండారెడ్డి పల్లి, కొండగల్ కు కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నారు. రుణమాఫీ పై ధర్నాలు చేసేది టిఆర్ఎస్ కార్యకర్తలని చెప్పారు రేవంత్ రెడ్డి.