తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో అందరి ముందే ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. దళితులను ఉద్దేశించి జూపల్లి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. జూపల్లికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు.జట్రపోల్ గ్రామంలో సర్వే నంబర్ 508లో గల 8 ఎకరాల భూమిలో గురుకుల పాఠశాల నిర్మాణం కోసం పరిశీలించేందుకు వచ్చారు. అయితే ఆ భూమి తమదని దళితులు మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు ఆందోళన చేశారు.దీంతో ఆగ్రహానికి లోనైన మంత్రి జూపల్లి.. దళితులపై నోరు పారేసుకున్నారు. ఏయ్ నోరు ముయ్యండి.. పనికిమాలిన గొడవ అంటూ దళితులను తిట్టారు మంత్రి జూపల్లి కృష్ణా రావు.
గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమి తీసుకుంటోంది ప్రభుత్వం. దీంతో తమ భూములు తీసుకోవద్దంటూ దళితులు ఆందోళనకు దిగారు.
మీకు మా భూమే దొరికిందా అంటూ ప్రశ్నించారు. వారిని ఉద్దేశిస్తూ ఏయ్ నోరు ముయ్యండి.. పనికిమాలిన గొడవ అంటూ మంత్రి జూపల్లి నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో అవాక్కైన దళితులు.. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు.