ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎంపీలపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం

విశాఖపట్నం,క్రైమ్ మిర్రర్:- విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతపడుతుంటే ఏపీ ఎంపీలు మౌనంగా ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. రామకృష్ణ మాట్లాడుతూ, “విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 34 మంది తమ ప్రాణాలను అర్పించారు. ఆ బలిదానాలకు గౌరవం ఇవ్వాల్సింది పోయి.. ఈనాడు కేంద్రం ప్రైవేటీకరణ అజెండాతో స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తోంది. ఇదేనా మీరు చెల్లించే గౌరవం?” అని ప్రశ్నించారు.

Read also : ఏపీ మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇక్కడ నో ఫ్రీ బస్?

అనకాపల్లి ప్రైవేట్ ప్లాంట్ – గనుల మంజూరుతో వివాదం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇనుము గనులు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కానీ అనకాపల్లిలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం గనుల మంజూరు విషయమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. “ప్రజల సొత్తైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చడమే లక్ష్యమా?” అని ఆయన ప్రశ్నించారు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు రామకృష్ణ హెచ్చరిస్తూ, “ప్రజల నమ్మకాన్ని తుంగలో తొక్కితే, చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. విశాఖ ఉక్కు కోసం జరిగిన పోరాటం మళ్లీ ముదురుతుంది. ప్రజల కోపం జ్వాలలు రగులుతాయి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు విశాఖలో రాజకీయ వర్గాల్లో, కార్మిక సంఘాల్లో చర్చనీయాంశమయ్యాయి. స్టీల్ ప్లాంట్ సమస్యపై ఇప్పటికీ ఏకగ్రీవంగా ఆందోళన చూపలేని ఏపీ ఎంపీల నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి రగిలిస్తున్నది.

Read also : ఉప్పల్‌లో ఉద్రిక్తత: రామంతాపూర్ విద్యుత్ ప్రమాదం ఘటనపై స్థానికుల ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button