తెలంగాణ

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తర్వాతే డీఎస్సీ నియామకాలు!

తెలంగాణలో డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం మొదలైంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డీఎస్సీ నియామక పత్రాలు అందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును వాటి మార్గదర్శకాలను తక్షణమే అమలు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఎస్సీ నియామకాలు చేపట్టాలని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు.

మాదిగ స్టూడెంట్స్ రాష్ట్ర అధ్యక్షులు బుషిపాక గణేష్ మాదిగ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు సమావేశం పెట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల మాజి డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. ఆగస్టు 1న అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు తక్షణమే చేపడతామని భారత దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేస్తామని అవసరమైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పలాలు మాదిగ విద్యార్థులకు అందే విధంగా ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ల లోనే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తానని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందన్నారు. అది జరిగి 2 నెలలు కావస్తున్నా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తక్షణమే డీఎస్సీ నియామక ప్రక్రియ ను రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లో నిర్వహించే విద్య,ఉద్యోగ నియాకాల్లో TGPSC- GROUP 1,2,3,JL తదితర ఉద్యోగాల్లో వెంటనే వర్గీకరణ ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు లోకల్ బడి ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు అవసరమైతే హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి మొదటినుండి మాదిగల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చారని బుషిపాక గణేష్ మాదిగ అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డే పలుసార్లు చెప్పారని గుర్తు చేశారు. మొదటి నుండి మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని.. అక్టోబర్ 9న చేపట్టే డీఎస్సీ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళ అజయ్ మరియు T MSF రాష్ట్ర నాయకులు గుమ్మడిపల్లి తిరుమలేష్ మాదిగ, కూరపాటి ఆంజనేయులు మాదిగ, సందీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Back to top button