క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వచ్చే ఏడాది మార్చిలో తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలబలాల ఆధారంగా అధికార కాంగ్రెస్ కు నాలుగు, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనున్నాయి. కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకటి మిత్రపక్షం సీపీఐకి ఇవ్వనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. దీంతో ఒప్పందంలో భాగంగా తమకు రావాల్సిన ఎమ్మెల్సీ సీట్ల కోసం సీపీఐ ఏడాది కాలంగా ఎదురు చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నిక సమయంలో పొత్తులో భాగంగా సీపీఐ రెండు సీట్లకు పట్టుబట్టింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటుతో పాటు నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటు ఆశించింది. ఈ రెండు సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా అంగీకరించింది. సీపీఐ కూడా రెండు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది.
Also Read : మై డియర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
కొత్తగూడెం అభ్యర్థిగా కూనంనేని సాంబశివారావు, మునుగోడుకు జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పేర్లను ప్రకటించింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో సీన్ మారిపోయింది. రాజగోపాల్ రెడ్డి కోసం మునుగోడు తీసుకుంది కాంగ్రెస్. అయితే మునుగోడును ఇచ్చినందుకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీపీఐతో డీల్ చేసుకుంది. ఆ సీటు కూడా మునుగోడు సీటును త్యాగం చేసిన నెల్లికంటి సత్యంకు ఇస్తామని తెలిపింది. ఆ ఒప్పందంలో భాగంగా మార్చిలో జరగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా సీట్లలో.. ఒకటి సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించందని తెలుస్తోంది. ఈ సీటు కోసం సీపీఐ రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ తోనూ చర్చలు జరిపారని సమాచారం. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సీపీఐకి ఎమ్మెల్యే కోటాలో ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పచ్చజెండా ఊపారని సమాచారం. దీంతో నల్గొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ సీటు దక్కినట్టేనని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి :