Monday, February 23, 2026
Homeతెలంగాణఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు సీరియస్

ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు సీరియస్

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ గా పరిగణలోకి తీసుకుంది సీజే ధర్మాసనం. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిజేకు లేఖ రాసిన హైకోర్టు న్యాయమూర్తి. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే పై రఘునందన్ వ్యాఖ్యలు చేశారని తన లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆగస్టు 24న రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి న్యాయవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తన లేఖలో న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు.

న్యాయవ్యవస్థ పట్ల రఘునందన్ రావు అగౌరవం కలిగి ఉన్నారని తన లేఖలో పేర్కొన్నారు న్యాయమూర్తి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల న్యాయస్థానం ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేసింది సీజే ధర్మాసనం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments